

తేది:11-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో మొదటి విడత పోలింగ్ శాతం 77.68
మొత్తం 2,18,194 ఓట్లలో పోలైన ఓట్లు 1,69,846
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ 77.68 శాతం నమోదు అయింది.
భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపెల్లి, మెట్ పెల్లి మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు.
7 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 2,18,194 ఉండగా పోల్ 1,69,846 అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 77.68 శాతం పోలింగ్ నమోదు అయింది.
మండలాల వారిగా ఓటర్లు.. నమోదు అయిన పోలింగ్ శాతం.
భీమారంమండలంలో మొత్తం ఓటర్లు 17,577మంది ఉండగా, 13,476 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.67 శాతం నమోదు అయింది.
ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం ఓటర్లు 30,465 మంది ఉండగా, 23,802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.13 శాతం నమోదు అయింది.
కథలాపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 37,516 మంది ఉండగా, 28,042 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 74.75 శాతం నమోదు అయింది.
కోరుట్ల మండలంలో మొత్తం ఓటర్లు 31,243 మంది ఉండగా, 24,617 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.79 శాతం నమోదు అయింది.
మల్లపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 41,103 మంది ఉండగా, 32,913 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.07 శాతం నమోదు అయింది.
మేడిపెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 24,251 మంది ఉండగా, 18,777 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.43 శాతం నమోదు అయింది.
మెట్ పెల్లి మండలంలో మొత్తం ఓటర్లు 36,039 మంది ఉండగా, 27,859 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.3 శాతం నమోదు అయింది.
-వివిధ గ్రామాల్లో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్
-పాల్గొన్న అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు, కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవోలు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్
మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.గురువారం మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని సంగెం, నాగులపేట్, ఐలాపూర్ గ్రామాలు, మెట్ పెల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్ గ్రామాలు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యక్షంగా పరిశీలించారు.మెట్ పెల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ జిల్లా సాధారణ పరిశీలకులు జి. రమేష్ తో కలిసి పోలింగ్ జరుగుతున్న కేంద్రాలను పరిశీలించారు.ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.
పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు.
గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించకూడదని ఎన్నికల అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు, కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవోలు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, ఎమ్మార్వో లు, ఎంపిడివోలు, తదితరులు ఉన్నారు.