

తేది:11-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS
స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు శాంతియుత వాతావరణంలో ముగిసింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా కొనసాగగా, పోలీసు బందోబస్తు, క్యూ ఆర్ టీలు, మొబైల్ పార్టీలు భద్రత నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్ వ్యవస్థాపన, శాంతిభద్రతల పర్యవేక్షణ సమర్థవంతంగా జరిగింది.
మండలంలోని ఎక్కడా అపరిచిత సంఘటనలు నమోదు కాలేదు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి సహకరించిన ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని అధికారులు ప్రశంసించారు.