
తేది:11-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు గురువారం పరిశీలించారు.
బురుగుపల్లి పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ గారు అక్కడి భద్రతా ఏర్పాట్లు, పోలీస్ మోహరింపులు, సీసీటీవీ పర్యవేక్షణను సమీక్షించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను కూడా మోహరించారు.
ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆయన ప్రజలకు సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు ఆదేశించారు.