

తేది:11-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జి
ఆకుల సంజయ్ రెడ్డి
జగిత్యాల జిల్లా: మొదటి విడత సర్పంచు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు.