బెల్లి లలిత జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలి

 

తేది:10-12-2025 రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పోపూరి ముఖేష్ చంద్ర.

 

బెల్లి లలిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇయ్యాలి-యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

ఎల్బీ నగర్ చౌరస్తాలో బెల్లి లలిత విగ్రహానికి భూమి పూజ చేసిన-యాదవ జేఏసీ నాయకులు

మలిదశ తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలిత జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో బెల్లి లలిత విగ్రహం ఏర్పాటు కోసం యాదవ జేఏసీ వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్,యాదవ జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉపేంద్రమ్మ యాదవ్ తో కలిసి భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం బెల్లి లలిత అనేక పోరాటాలు చేసిందన్నారు.బెల్లి లలిత పోరాటం ద్వారానే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందన్నారు.అగ్రవర్ణాలు రాజకీయ కుట్రలతో బెల్లి లలితను 17 ముక్కలుగా నరికి చంపారన్నారు.బెల్లి లలితను చంపిన హంతుకులను ఏ ప్రభుత్వం కూడా నేటికి పట్టుకోలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బెల్లి లలిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు బెల్లి లలిత పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కేవిగౌడ్, రఘురాం నేత, శ్రీనివాస్,పాపన్నగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *