తేది:10-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణా గౌడ్.
సంగారెడ్డి జిల్లా: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా స్థానిక హై కోర్ట్ న్యాయవాది నెమలికొండ హరీష్ కుమార్ సంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ను న్యాయవాదులను కలసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వాదుల సంక్షేమం మరియు న్యాయ వాద రక్షణ అత్యంత అవసరమని, జూనియర్ న్యాయవాదుల అవసరాలను తీర్చడానికి తన పూర్తి సహకారాన్ని అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. కరోనా సమయంలో జూనియర్ న్యాయవాదులు చాలా ఇబ్బందులు పడ్డారని మెడికల్ ఇన్సూరెన్సు పెంచడానికి బార్ అసోసియేషన్స్ మరియు మహిళా న్యాయవాదుల సమ ప్రాధాన్యత కోసం మహిళా న్యాయవాదుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుత బార్ కౌన్సిల్ తమ పదవీ కాలాన్ని పెంచుకోవడానికి తప్ప న్యాయవాదుల సెంక్షేమానికి ఉపయోగ పడలేదని కొత్తవారిని ఎన్నుకొని యాక్టివ్ బార్ కౌన్సిల్‌గా మార్చాలని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు దామోదర్ రెడ్డి, అనంతరావు కులకర్ణి, రాంరెడ్డి, గోవర్ధన్, బస్వరాజ్ పాటిల్, అంబరీష్, సురేందర్ మరియు వీరమహేందర్ పాల్గొన్నారు.

