

తేది:10-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ పట్టణంలో ఈ రోజు కిసాన్ ఫ్యాషన్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సందడి జరిగింది. ప్రముఖ సినీనటి అనసూయ గారు ప్రధాన అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కిసాన్ ఫ్యాషన్ మాల్ వ్యవస్థాపకులు, నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ప్రత్యేకంగా విచ్చేశారు.
అదే విధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు, మెదక్ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేడ్చల్–మల్కాజ్‌గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంత్ రావు గారు పాల్గొని ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ—
మెదక్ పట్టణ అభివృద్ధికి ఈ తరహా వాణిజ్య సంస్థలు ఎంతో ఉపయుక్తం అవుతాయని
స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని
వినియోగదారులకు ఒకే చోట నాణ్యమైన వస్త్రాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
కార్యక్రమానికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు భారీగా హాజరై జోష్‌నిచ్చారు. కార్యక్రమం మొత్తం ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జనసందోహంతో కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రాంగణం సందడి మారింధి , ప్రారంభ వేడుక విజయవంతంగా పూర్తైంది.