తేది:10/12/2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు మండలాల్లో రేపు జరుగనున్నాయని, ఈరోజు నుంచి, రేపు కౌంటింగ్ ముగిసేవరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, చిన్న ఏమరుపాటు కూడా ఉండకూడదని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
నెల్లికుదురు మండలకేంద్రంలోని ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్పీ డాక్టర్ శబరీష్ సందర్శించారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పండుగవాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్ శాఖ అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు.