
తేది:10-12-2025 ములుగుజిల్లా:TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్.
ములుగు జిల్లా పోలీసులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ను తెలుసుకొని ఆకర్షిత, అవగాహన కార్యక్రమానికి ప్రభావితులై, మావోయిజం, నక్సలైట్ ఉద్యమం మీద విరక్తి పొంది ప్రశాంతత జీవితం గడపాలని ఉద్దేశంతో సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరి లొంగుబాటు
మహిళ సభ్యులు మడకం మళ్లీ, తండ్రి పేరు బండి, వయస్సు 20 సంవత్సరాలు గ్రామం జబ్బగట్ట, చితనార్ పోలీస్ స్టేషన్ పరిధి, జిల్లా సూక్మ, ఛత్తీస్గడ్ రాష్ట్రం ..ఈమె పార్టీలో ఆకాష్ డి వి సి ఎం టీం మెంబర్గా పని చేస్తున్నది… లొంగిపోయిన రెండవ నక్సలైటు పోయెమ్ రామే, తండ్రి సుక్కు, వయసు 21 సంవత్సరాలు, జోజూరు గ్రామం, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధి,
బీజాపూర్ జిల్లా, చత్తీస్గడ్ రాష్ట్రం, ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుంది ఇప్పటివరకు లొంగిపోయిన 87 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం కింద ప్రభుత్వం కల్పించిన వసతులతో సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారని వీరు కూడా అవగాహన పొంది అర్థం చేసుకొని లొంగిపోయారని,, ఇంకా మిగతా నక్సలైట్లు మావోయిస్టులు కూడా సరెండర్ పాలసీని సద్వినియోగం చేసుకొని లొంగిపోయి మీ గ్రామంలో మీ తోటి ప్రజలతో ఆనందంగా జీవించి ప్రజల మన్ననలు పొందేలా మంచి జీవితాన్ని ఆరంభించండి అని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పిలుపునిచ్చారు.