స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజురు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ నెల 28న రాజమండ్రి జైలుకు చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయి. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చు. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలి.’ అని పేర్కొంది.