తేదీ 09-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS
సదాశివపేట :
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని బిఆర్ఎస్ బలపరిచిన మద్దికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాండు నాయక్ కోరారు . మంగళవారం మద్దికుంటలో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ నామినేటెడ్ సదాశివపేట పిఎసిఎస్ వైస్ చైర్మన్ పదవి వదులుకొని గ్రామ ప్రజల పై నమ్మకం,ఆశీర్వాదం కోసం సర్పంచ్ బరిలో ఉన్నానన్నారు . విద్యావంతుడైన పాండు నాయక్ వైపే గ్రామస్తులు మొగ్గు చూపడం విశేషం. ప్రజలంతా కలిసికట్టుగా ఆయన తరుపున ప్రచారం చేయడం మరో విశేషం. గ్రామంలో యువత, మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆశీస్సులు,సహకారంతో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, పలు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించిన పాండు నాయక్ కే మా ఓటు అని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు. ఎన్నికల్లో అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.