9 డిసెంబర్ మెదక్ TSLAWNEWS
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందుగా సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ముగింపు వరకు 163 BNSS (పాత 144 సెక్షన్) అమల్లో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, IPS గారు తెలిపారు.శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల సందర్భంగా ఎంసీసీ ఉల్లంఘనలు, మద్యం, నగదు పంపిణీ, గొడవలు, వదంతులు వంటి వాటిపై పోలీసు శాఖ వెంటనే స్పందిస్తుందని చెప్పారు. మొదటి విడత పోలింగ్ కోసం 750 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అదే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.
— జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, IPS