గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ( గోపా ) సిద్దిపేట జిల్లా నూతన జిల్లా కమిటీ నిర్మాణం కోసం ఈ రోజు తాడూరి బాలా గౌడ్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా “గోపా ” జిల్లా కన్వీనర్ పల్లె వంశీ క్రిష్ణ గౌడ్ వ్యవహారించారు.
ఈ సమావేశానికి గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాటంలో అన్ని రకాల అసోసియేషన్ల అధ్యక్షులు, కన్వీనర్స్ గా జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ముందుండి పోరాటం సాధించిన జాతి మన గౌడ జాతి అని తెలియచేస్తూ, ఈ సందర్భంగా పాపన్న గొప్పతనాన్ని వివరిస్తూ “అమ్మ ఈ బతుకు బతకలేనమ్మ రాజునై రాజ్యాన్ని నేలతానమ్మ” అని చిన్నప్పడే నిర్ణయించుకుని గోల్కొండ ఏలిన పాపన్న వారసులం మనం. ఆకాశమంత ఎత్తైన చెట్టును అవలీలగా ఎక్కగలిగిన దమ్ము, ధైర్యం, సాహసం ఉన్న జాతి మన గౌడ జాతి అని, భవిష్యత్ లో బహుజన రాజ్య స్థాపన కోసం అన్ని కులాలు జాతుల వాళ్ళని కలుపుకొని ముందుకెళ్లే ఏకైక జాతి మన గౌడ జాతి అని గౌడ్ ల గొప్పతనం తెలియజేశారు. ఇంత గొప్ప గౌడులను ఒకే వేదికపై తీసుకుని రావడానికి ఏర్పాటైన గొప్ప వేదిక మన ” గోపా ” అని వివరించారు.
మన జాతిలో ఇంకా ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీని ” గోపా ” ఒక ప్రత్యేకమైన విలక్షణమైన లక్షణం ఉన్న
” గోపా ” లో గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాకుండా, ప్రొఫెషనల్స్ లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు మొదలైన వాళ్ళందరి సమూహముతో 1975 లో ఏర్పాటు కాబడి ఇప్పటికీ అన్ని జిల్లాలతో కనెక్టివిటీని ఏర్పరచుకుని అన్ని రంగాల్లోని సభ్యులకు, విద్యార్థులకు, యువతకు సంబంధించిన అవకాశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ముందుకెళుతూ చట్టసభల్లో మన వాళ్ల సంఖ్యను పెంచడానికి చురుకైన పాత్ర పోషిస్తుంది .
కమ్యూనికేషన్, స్కిల్ డెవలప్మెంట్ విధానాలన్నింటినీ అందించే నెట్వర్క్ మన ” గోపా ” అని ” గోపా ” గురించి వివరించడం జరిగినది. ప్రధాన కార్యదర్శి జీ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మన పెద్దలు, అధికారులు ఎంతో శ్రమ తీసుకుని ” గోపా ” కు, గౌడ సమాజానికి వారి పరిదిలో చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ అన్ని విధాలుగా మన కోసం అన్ని పనులు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా సరిగ్గా తెలుసుకొనకుండా తొందరపడి వాట్సాప్ లో గానీ, కుల సంఘాల మీటింగ్ లలో గానీ, మరే విధమైన సమావేశాలలో గాని అలాంటి పెద్ద వారిని అగౌరవ పరిచే విధంగా మాట్లాడవద్ధు అని తెలిపారు.
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యల్మకంటి మీరయ్య గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే దాదాపు 20 వేల సభ్యత్వం కలిగి ఉన్న మన ” గోపా ” 2026 డిసెంబర్ వరకు లక్ష మెంబర్షిప్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నదని తెలియచేస్తూ
అందుకోసం ప్రతీ ” గోపా” సభ్యులు కనీసం నెలకు ఒక కొత్త సభ్యునిగా చేర్పించాలని కోరడం జరిగినది. మరో ఆర్గనైజింగ్ సెక్రెటరీ గూడేపూరి సాయి వేణు గౌడ్ మాట్లాడుతూ,” గోపా ” పూర్తిగా డిజిటలైజ్ చేయడం ఇప్పటికే దాదాపు పూర్తి కాబోతుందని, మీరు సభ్యులుగా చేరిన మరుక్షణం లోనే మీ యొక్క సభ్యత్వం కార్డ్ ఇవ్వడం జరుగుతున్నదని వివరించడం జరిగినది.
ఈ సమయంలో నూతన కమిటీ ఏర్పాటు లో భాగంగా బుర్ర తిరుపతి గౌడ్ అధ్యక్షులు గాను, పల్లే వంశీ క్రృష్ణ గౌడ్ ప్రధాన కార్యదర్శి గాను, నేరేళ్ల క్రిష్ణమూర్తి గౌడ్ కోశాధికారి గాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటైర్డ్ ప్రొఫెసర్ గొట్టిపర్తి పాపయ్య గౌడ్, చేర్యాల కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరేళ్ల వీరమల్లయ్య గౌడ్ మొదలగు వారు హాజరు కావడం జరిగినది