
8డిసెంబర్ మెదక్ TSLAWNEWS
మెదక్ జిల్లా పోలీస్ శాఖ CEIR (Central Equipment Identity Register) పోర్టల్ వినియోగాన్ని విస్తృతం చేస్తూ ప్రజలకు మరింత సేవలను అందిస్తోంది. మొబైల్ ఫోన్లు పోయిన వారికి ఇది పెద్ద సహాయంగా మారుతోంది.
జిల్లాలో ₹15.34 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయగా, ఈ ఏడాదిలో మొత్తం 1,734 మొబైల్ ఫోన్లు ప్రజలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు మాట్లాడుతూ—
ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ (ceir.gov.in) లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఫోన్‌లో ఉండే వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారం, సోషల్ మీడియా వివరాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఇది అత్యంత కీలకమని చెప్పారు.
అదనంగా,
బలహీనమైన పాస్‌వర్డ్‌లు డేటా దుర్వినియోగానికి దారి తీస్తాయని తేలిపారు, ఫోన్ పోయిన వెంటనే బ్యాంక్‌లకు సమాచారం ఇచ్చి వెంటనే UPI & ఇతర లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచన,సెకండ్‌హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా IMEI ధృవీకరణ చేయాలన్న విజ్ఞప్తి.
దొరికిన మొబైల్ ఫోన్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని తేలిపారు.
మొబైల్ రికవరీలో ప్రత్యేక ప్రతిభ చూపిన ఐటీ కోర్ టీమ్ కానిస్టేబుల్స్ విజయ్, వెంకట్ గౌడ్, మహేందర్ గౌడ్ మరియు CEIR సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసపత్రాలు మరియు రివార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, DCRB ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఐటీ కోర్ మరియు CEIR బృందాలు పాల్గొన్నారు.