నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కాసోజి శ్రీకాంత్ చారి.. నేడు బీసీ రిజర్వేషన్లపై మన స్థాపన చెందిన ఆత్మబలిదానం చేసుకున్న శ్రీ సాయి ఈశ్వర్ చారి

 

టీఎస్ న్యూస్ డిసెంబర్ 6

సంగారెడ్డి న్యూస్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారుడుగా అమరుడైన కాసోజి శ్రీకాంత్ చారి అతి ఘోరంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రాణ త్యాగశీలి అని అందరికీ తెలిసిన విషయమే! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్య పాత్ర పోషించింది యువకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అన్ని కుల సంఘాలు, వివిధ రకరకాల సమస్తల సభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు, తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించి అప్పట్లో రజాకార్లు ఎలా అయితే పోరాటం చేసి నైజాం పాలకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ లొంగిపోయిన సంగతి చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే! అప్పట్లోదొరలు, జమీందారులు, పటేల్, పట్వారి, వ్యవస్థఏర్పాటు చేసుకుని తెలుగు, కన్నడ, మలయాళం, రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకొని దొరలు పాలించుకునేవారు, రాను రాను రాష్ట్రాల విభజన చేసుకొని కులాలు వారిగా విభజన చేసి వారి జీవన ఉపాధికి భూములనుపంచి పెట్టడం జరిగింది. ఇది ఒక్క నాకి చరిత్ర! ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం తో పాటు, ప్రజా ప్రతినిధుల పాలన ఏర్పాటు చేసి మన దగ్గర ఉన్న వనరులు, విచ్చలవిడిగా దోపిడికి గురవైంది, ఇప్పటికీ అదే రీతిలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కుల మత భేదాలతో ప్రజాపాలన కొనసాగుతుంది వీరికి తోడు ప్రభుత్వ యంత్రాంగం సరియైన పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి విచ్చల వీడియో భూకబ్జాలు, అటవీ సంపద, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జిల్లా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖలు విచ్చలవిడిగా అవినీతికి అలవాటు పడి ప్రజల్ని మభ్యపెట్టి లేనిపోని సంక్షేమ పథకాలు పేర్లతో ప్రాంతీయ పార్టీలు గానీ, జాతీయ పార్టీ నాయకులు గాని ఎజెండాలు పక్కన పెట్టి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ తెలంగాణ సంపద అంతా దోచుకుంటూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఇతర సంస్థల ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్కువ సంఖ్యలో భూ కబ్జాకు, పరిశ్రమల పేరుతో, ప్రవేట్ విద్య వైద్య కార్పొరేట్ సంస్థల పేరుతో అగ్రవర్ణ కులాలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో 30% మాత్రమే ఉండగా ఇష్టానుసారంగా మన తెలంగాణ దోచుకునే రెడ్డీస్, వెల్లమ్మ, కమ్మ, కులాలు వారిగా దోసుకుంటే చూసి చూడనట్టుగా ప్రభుత్వ యంత్రాంగం ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఈరోజు వరకు మధ్యతరగతి వాళ్లకు ఇంకా అర్థం కావడం లేదు.. తెలంగాణ సంపదను కాపాడుకునేందుకు బిసి, ఎస్ సి,ఎస్టి, మైనారిటీలు, అందరూ కలిసి తెలంగాణ సంపదను, తెలంగాణ అభివృద్ధికి వీరందరూ కలిసి సహకారం చేసినప్పుడే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అధికారం కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంక్షేమ పథకాలు ఇంతవరకు ఎవరు అడగలేరు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఇది కేవలం మన కల మాత్రమే! యువత వెన్నుముక్కలాంటిది అంటారు కేవలం ఇది కల్పిత మాత్రమే! యువకుల్లారా దయచేసి మీకు చెప్పేది ఒకటే మనకు న్యాయం జరిగినప్పుడు అందరూ కలిసి పోరాడుతూనే విజయం సాధిస్తాం ఇది వాస్తవం,, అనవసరంగా ప్రాంతీయ పార్టీ గాని జాతీయ పార్టీలు గానీ వారు చెప్పిన మాటలు ముఖ్యంగా యువకు లు దయచేసి ఆత్మహత్య కానీ ప్రాణ త్యాగాలకు గాని బలిదానం చేసుకోకూడదని యువతకు హెచ్చరించడం జరుగుతుంది. మీ తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఎన్నో కలలు కంటారు తమ తల్లిదండ్రులను కలలను నిర్భయంగా చేసి చూపించండి నీ తల్లిదండ్రుల ముఖాలపై ఆనందాన్ని చూడగలుగుతాం, తమ ఆశయాల మేరకు పోరాటానికి కానీ బలిదానం చేసుకోకండి యువకుల్లారా మీరు ఒకసారి ఆలోచించండి, మనం మంచి ఉంటే తమ తోటి యువకులతో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి అవసరమైతే ప్రభుత్వ అధికారులను గాని, ప్రజా ప్రతినిధులను నీ గ్రామ సమస్యలపై నిలదీయండి, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అభివృద్ధి చేసేందుకు యువకులు ముందుకు రావాలి అప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే అవకాశం యువతపై నే ఆధారపడీ ఉంది.
శ్రీ సాయి ఈశ్వర్ చారి మృతి పట్ల అన్ని కుల సంఘాలు రాస్తారోకాలు చేపట్టి ఉద్యమకారుల స్థూపం దగ్గర సంగారెడ్డి పట్టణంలో ఐబి దగ్గర శ్రీ సాయి ఈశ్వర చారి కి భారీ సంఖ్యలో వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా ఆయన ఫోటోకు పూల మాలలు వేసి శ్రీ సాయి ఈశ్వర చారి అమర్ హాయ్ నినాదాలతో శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నజరానా కల్పిస్తూ వారి పిల్లల చదువుల ప్రభుత్వం భరించాలని వారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వివిధ సంఘ నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆడపడుచులు, యువకులు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం, జే ఏ సి వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల కృష్ణ, జిల్లా బిసి జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గౌండ్ల మంజుల ఈశ్వర్ గౌడ్,ప్రజా సంఘాలు వివిధ కులాల సంఘాలు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *