దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 135 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడని కొనియాడారు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో మాజీ కెప్టెన్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేశాడో, ఈ ఇన్నింగ్స్‌లోనూ అదే విధంగా దూకుడుగా ఆడాడని కుల్దీప్ ప్రశంసించాడు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైందని కుల్దీప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
కీలక సమయంలో కోహ్లీ ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కుల్దీప్ పేర్కొన్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా కోహ్లీ తన సహచరులకు విలువైన సూచనలు చేస్తుంటాడని తెలిపారు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి అని, అతని నుండి ఎంతో నేర్చుకోవచ్చని కుల్దీప్ యాదవ్ అన్నారు.