*టీఎస్ లా న్యూస్ ను ఆశ్రయించండి, ప్రజా సమస్యలు పరిష్కరించుకోండి- సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి.
*ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పల్లె పల్లెకు టీఎస్ లా న్యూస్ – న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలిసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు మెదక్ జిల్లా టీఎస్ లా న్యూస్ జిల్లా సిబ్బంది. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జెస్, సీనియర్ న్యాయవాదులు మరియు మేధావి వర్గాల ఆలోచన విధానంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పల్లె పల్లె కు టీఎస్ లా న్యూస్ వస్తుందని కొనియాడారు ఇట్టి సేవలను ప్రజలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని సమస్యలు లేని ప్రాంతాలుగా, అభివృద్ధి చెందిన గ్రామాలుగా చరిత్రలో నిలిచే విధంగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజలకు పేరుపేరునా విజ్ఞప్తి చేస్తూ న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని కొనియాడారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం టీఎస్ లా న్యూస్ సేవలను ప్రజలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని అందుకు గాను ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ జిల్లా టీఎస్ లా న్యూస్ చీఫ్ అడ్వైజర్ బీఎస్పీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు నగులూరి స్వామి దాస్ గారు, మెదక్ జిల్లా టీఎస్ లా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్, హవేలీ ఘన్పూర్ మండల్ రిపోర్టర్ సందీప్ గౌడ్, రిపోర్టర్ కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.