ఎన్నికల వేల పలుచోట్ల వేలంపాట హల్ చల్ చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా వేలంపాట జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలలో వేలంపాట నిర్వహించారు. అభివృద్ధి పేరుతో లక్షల్లో భేరాలు, పంట పొలాల వరకు హామీలు ఇస్తున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా గొర్లఖాన్ దొడ్డిగ్రామపంచాయితీ సర్పంచ్ స్థానానికి.. ఒక వ్యక్తి రూ.57 లక్షల వేలంపాట పాడి దక్కించుకున్నట్లు సమాచారం. కొండపల్లి గ్రామంలో ఆలయ అభివృద్ధికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఏకగ్రీవంగా సర్పంచ్ కావొచ్చని ప్రకటన రావడంతో ఆర్గనైజర్ దాదాపు రూ. 60 లక్షలు ఇస్తానని ప్రకటించినట్లు సమాచారం.
ఆయన ఒక్కరే నామినేషన్ల వేసేలా కండీషన్లు పెట్టారు. అలాగే గొల్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి రూ.53 లక్షలు పలికినట్లు తెలుస్తోంది. అందుపల్లి గ్రామంలో ఓ నాయకుడు రూ.23 లక్షలు ఇస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఆయన ఒక్కరే నామినేషన్లు వేసేలా కండీషన్లు పెట్టారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట జరిగినట్లు తెలుస్తోంది. కేతిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో 38.50 లక్షల వేలంపాటకు పదవి దక్కింది.
మద్దూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే.. పాఠశాల అభివృద్ధికి అరెకరం పొలం ఇస్తానంటూ రాసిచ్చిన బాండు కాగితం వైరల్ అవుతుంది. ఇక మహబూబ్ జిల్లా మర్చెల మండలంలో ఓ నాయకుడు తనకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే.. గ్రామాభివృద్ధికి లక్షలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు.