తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులను మాత్రమే అరెస్ట్ చేసింది సీబీఐ. ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల వంతైంది. గతంలో చక్రం తిప్పినవారిపై ఫోకస్ చేసింది. సరుకుల కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసింది. దీంతో మరిన్ని అరెస్టు జరుగుతాయని అంటున్నారు. వచ్చేవారంలోపు మరో ఇద్దరు అరెస్టు కావచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.