తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి, మొదటి మూడు రోజుల (డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనాలకు సంబంధించిన ఉచిత టికెట్లను లక్కీ డిప్ (ఎలక్ట్రానిక్ డిప్) విధానంలో కేటాయిస్తోంది.
ఈ ఉచిత టికెట్ల కోసం భక్తులు నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ తో పాటు, వాట్సాప్ ద్వారా కూడా సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
-
కుటుంబ అవకాశం: ఒక రిజిస్ట్రేషన్‌లో మొత్తం నలుగురికి (1+3) దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
-
ఎంపిక ప్రక్రియ: డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.