వైకుంఠ ద్వార దర్శనం: తిరుమల భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక ప్రకటన చేశారు. సామాన్య భక్తులే ప్రయారిటీగా దర్శనాలపై నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని బీఆర్ నాయుడు తెలిపారు.

ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో, 7 రోజుల పాటు టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతి ఉంటుందని, అయితే కేవలం తొలి 3 రోజులు మాత్రం ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించామని చైర్మన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక దర్శనాలు కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. రోజుకు వెయ్యి మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్, చంటి పిల్లల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు.

మొత్తం 184 గంటల దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శనానికే కేటాయించామని టీటీడీ చైర్మన్ తెలిపారు. డిసెంబర్ 10వ తేదీన తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 5 వేల టోకెన్లను విడుదల చేస్తామని ప్రకటించారు. మరోవైపు, డిసెంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం కోటా, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూ. 300 కోటా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *