స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల వాయిదా పడింది. ఈ సమయంలోనే స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లను తొలగించడంతో, ఈ జంటపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
-
వైరల్ అవుతున్న వాదన: సోషల్ మీడియాలో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందంటూ ఒక స్క్రీన్‌షాట్ కూడా వైరల్ అయింది.
-
నిజానిజాలు: ఈ వాదనను పరిశీలించినప్పుడు, స్మృతి మంధాన పలాష్‌ను అన్‌ఫాలో చేయలేదని తేలింది. స్మృతి ఫాలోయింగ్ లిస్ట్‌లో పలాష్ ముచ్చల్ ఉన్నాడు.
అయినప్పటికీ, పెళ్లి వాయిదా పడటం, స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుంచి పెళ్లికి సంబంధించిన పోస్టులను తొలగించడం వంటి చర్యల కారణంగా అభిమానులు ఈ జంట బంధంపై తీవ్రమైన చర్చ జరుపుతున్నారు. పలాష్ ముచ్చల్‌పై మోసం చేశాడంటూ మరికొన్ని రూమర్‌లు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటిపై స్మృతి కానీ, పలాష్ కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.