హైదరాబాద్, బషీర్ భాగ్ టిజిఐఐసి కార్యాలయంలో టిజిఐఐసి చైర్ పర్సన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారిని,పొలిటికల్ రెస్యూమ్ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు, ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సమయాన్ని కేటాయించి ప్రజల్లో ఉండడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇట్టి అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం అధికారికంగా అవకాశం కల్పిస్తారని శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి ద్వారా టీపీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి పొలిటికల్ రెస్యూమ్ ను తీసుకెళ్లామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.