ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. వాస్తవానికి, అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా, కోర్టు నవంబర్ 14న తిరిగి వచ్చాక స్వయంగా హాజరుకావాలని షరతు విధించింది. అయితే, నవంబర్ 14న ఆయన హాజరు కాలేదు.
నవంబర్ 6న వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. తాజాగా, నవంబర్ 21వ తేదీలోపు కోర్టుకు హాజరవుతానని జగన్ తరఫున కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 21వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరుకానున్నారు.
యూరప్ పర్యటన పూర్తయ్యేంత వరకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన తన వినతిని జగన్ ఈరోజు విచారణలో ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసు విచారణలో ఆయన హాజరుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.