పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోకి లేని విధంగా భారీ లైనప్‌తో దూసుకుపోతున్నారు. ఆయన ఖాతాలో ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సాలార్ 2’, ‘కల్కి 2’ వంటి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాల మధ్యలో ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ‘బ్రహ్మరాక్షస’ అనే మరో క్రేజీ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య కొన్ని వివాదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాల కారణంగా వీరి కాంబోలో ఇప్పటికే ఒకే అయిన ‘జై హనుమాన్’, ‘మహాకాళి’ వంటి సినిమాలు పక్కన పెట్టే అవకాశం ఉందనే చర్చ తమిళనాట నడుస్తోంది. ఇదే క్రమంలో, తాజాగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ‘బ్రహ్మరాక్షస’ ప్రాజెక్టు కూడా మొదలుకాకుండానే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడితో, అది కూడా మన పురాణాల ఆధారంగా ప్రభాస్ సినిమా చేస్తే రిజల్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇలా భారీ హైప్ క్రియేట్ చేసిన ‘బ్రహ్మరాక్షస’ సినిమా మొదలుకాకుండానే ఆగిపోయే అవకాశం ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.