‘మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ తుక్కు తుక్కు కావాలి’: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మరియు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “రెండేళ్ల లో కేసీఆర్ ని తిట్టడం తప్పా, రేవంత్ రెడ్డి మరో పనిచేయలేదని” ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

జూబ్లీహిల్స్ బై పోల్ ప్రస్తావిస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీహిల్స్ గెలిస్తే, మేము మోసం చేసినా మాకు ఓటు వేశారు అని అంటారు” అని పేర్కొన్న కేటీఆర్, “జూబ్లిహిల్స్ బై పోల్‌లో.. మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ వాడు తుక్కు తుక్కు కావాలి” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు జాదుగాళ్లు అని, గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఒక్క పైసా కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, రేవంత్ రెడ్డి సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టాలని కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అవ్వ తాత లకు రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 వంటి హామీలు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ వాళ్లను “800 రోజుల్లో ఉన్న బాకీ కార్డుని అడగండి” అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ పాలనను తెచ్చుకోవాలని, జూబ్లీహిల్స్ నుండే కారు పార్టీ జైత్రయాత్ర ప్రారంభం కావాలని కేటీఆర్ ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *