బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్‌డీఏ కూటమి అధినేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమస్తీపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌డీఏ కూటమి ఈసారి రాష్ట్రంలోని అన్ని ఎన్నికల రికార్డులను తిరగరాయనుంది అని మోదీ స్పష్టం చేశారు. బిహార్‌లో ఏం జరగబోతుందో ఈ ప్రకటన ద్వారా ఆయన తేల్చిచెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్న ‘ఇండియా’ కూటమి నాయకులను విమర్శిస్తూ, “ఆరు లక్షల కోట్ల స్కామ్‌లలో బెయిల్‌పై బయటకువచ్చిన వారు ప్రజల మనస్సులు గెలుచుకోవాలని చూస్తున్నారు” అని ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా, మోదీ ప్రజలను తమ ఫోన్లలోని టార్చ్ లైట్లను ఆన్ చేయమని కోరారు. ప్రజలు టార్చ్ లైట్లు ఆన్ చేయగానే, “ఇప్పుడు ఆధునిక గాడ్జెట్లు ఉన్నందున, లాంతర్ల అవసరం లేదు” అని ఆయన ఆర్జేడీ పార్టీ యొక్క ‘లాంతరు’ గుర్తుపై వ్యంగ్యంగా సెటైర్ వేశారు.
అంతకుముందు, మోదీ భారతరత్న కర్పూరీ ఠాకూర్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యాఖ్యానాన్ని కూడా చేశారు. “ఆర్‌జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు, లాంటో ఒక ప్రముఖ నాయకుడి బిరుదును పొందాలని వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో పాటు వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించి, ఎన్‌డీఏ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.