ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల, ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా ప్రభాస్ నటిస్తోన్న సినిమాల నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ-హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ఆకట్టుకుంటూ కనిపించారు. “హ్యాపీ బర్త్‌డే రెబల్ సాబ్” అంటూ శుభాకాంక్షలు తెలిపిన టీమ్, త్వరలోనే సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘ది రాజా సాబ్’ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మిక్స్‌డ్ రెస్సాన్స్ రావడంతో, విజువల్స్ క్వాలిటీ మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను మెరుగుపరచడానికి దర్శకుడు మారుతి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా, సినిమా విడుదల తేదీ వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. అయితే, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, “జనవరి 9న అత్యంత గ్రాండ్ ఫెస్టివ్ రైడ్ రాబోతుంది. రెడీగా ఉండండి. మొదటి సింగిల్ త్వరలోనే రాబోతుంది” అంటూ ట్వీట్ చేసి, విడుదల తేదీపై మరోసారి స్పష్టతనిచ్చారు.

ఈ కామెడీ-హారర్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలి సినిమాల్లో ప్రభాస్‌కి రొమాన్స్ సీన్లు తక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తుండటంతో, వారి కోసం ఈ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నామని దర్శకుడు మారుతి ఇటీవల తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ మోడ్‌కి కాస్త విరామం ఇచ్చి హిలేరియస్‌గా నటించడం, ఆయన కామెడీ మరియు రొమాన్స్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈరోజు ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోయే కొత్త చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించడం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *