స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.4లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారని, ప్రైవేటీకరణపై సీఎం జగన్ కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశారని తెలిపారు. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకర్ణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.
ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెండ్రోజులు ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.