సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలోని ఐబి ప్రాంగణంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, వైస్ చైర్మన్ వి జి ఆర్ నారగోని గారు, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో తెలంగాణ బీసీ జేఏసీ సూచనల మేరకు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల వారు, 56 శాతంకు పైగా ఉన్న బీసీల జనాభాను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఏకగ్రీవంగా 42 శాతం రిజర్వేషన్ ను ఆమోదించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేరేవరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకోని అక్టోబర్18వ రోజున జరగబోయే బీసీ బందును విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారికి, సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి, సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే గారికి, అదేవిధంగా బీసీ నాయకులకు అందరికీ పేరుపేరునా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు.ఈ యొక్క సమావేశంలో మాజీ సర్పంచ్ సైదాపూర్ చింతకుంట రామా గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు తుల్జారాం గౌడ్, రజక సంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ, రజక సంఘం జిల్లా నాయకులు పంచలింగాల్ రాజు, హనుమాన్ నగర్ కాలనీ మాజీ అధ్యక్షులు శెట్టి బసవరాజ్, సంగారెడ్డి జిల్లా బీసీ నాయకులు జి శంకర్ గౌడ్, బిసి నాయకులు నరేష్ గౌడ్, అల్లిపురం శ్రీకాంత్, శ్రీశైలం యాదవ్, మరియు మండల ప్రజలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు