కేటీఆర్‌కు ఈసీ షాక్..

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఒక కొత్త వివాదం చెలరేగింది. ఓట్‌ చోరీపై.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేసిన ఆరోపణలను ఖండించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 43ఓట్లు ఉన్నట్టు కేటీఆర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. వీళ్లంతా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఓటర్లుగా ఉన్నవాళ్లేనని X వేదికగా తెలిపింది.

 

ఒక అడ్రెస్స్ పైన ఉన్న అపార్టు మెంట్‌లో 15 ఫ్లాట్స్ ఉండటంతో.. ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. 2023 నుంచి అక్కడ ఉన్న ఓట్లే తప్ప కొత్తగా ఓట్లు యాడ్ చేయలేదని వివరణ ఇచ్చారు ఎన్నికల అధికారులు.

 

మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌. ఓటమి భయం తో కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌పై బురదజల్లుతున్నారని ఆరోపించా రు. ఓట్లను ఈసీ ముద్రిస్తుందన్న సోయి లేకుండా కేటీఆర్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు పంచ్‌ ఇస్తే.. పోయి ఫామ్‌ హౌజ్‌లో పడ్డారని సెటైర్లు వేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ భారీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు బల్మూరి.

 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మూడు ప్రధాన పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసీ క్లారిటీతో బీఆర్‌ఎస్‌ ఆరోపణలు బలహీనపడ్డాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *