కమిటీ కురోళ్ళు సీక్వెల్ రెడీ..?

తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో మరోసారి పల్స్ రేట్ పెంచేస్తూ, ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ ఒక బిగ్ సర్ప్రైజ్‌తో మన ముందుకు రాబోతుంది. గత ఏడాది (2024) ఆగస్టు 9న చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద అయిన ఈ సినిమా… ఇప్పుడు సీక్వెల్‌తో రిపీట్ కాంబోని మరో సారి సిద్ధం చేస్తోంది. నిహారిక కొణిదెల నిర్మాణంలో, కొత్త దర్శకుడు యదు వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం 11 మంది కొత్త నటీ నటులకు ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ.

 

9 కోట్లకు.. రూ. 24 కోట్లు వసూళ్లు

కేవలం 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం 24.5 కోట్లు వసూళ్లు చేసి.. ప్రస్తుతం OTTలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అది కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కొత్త టాలెంట్‌కు ఒక మైలురాయి కూడా. ఇప్పుడు, ఆ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. యదు వంశీ డైరెక్టర్‌గా, నిహారికా ప్రొడ్యూసర్‌గా మరోసారి కలిసి ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కథను యదు వంశీ ఇప్పటికే రెడీ చేశారట. ఇంతకముందు సినిమాలోని ఎమోషనల్ డెప్త్‌ని మరింత ఎలివేట్ చేస్తూ, ప్రేక్షకులను మళ్లీ వాళ్ల చిన్నప్పటి గ్రామీణ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తారని అంటున్నారు.

 

కమిటీ కుర్రాళ్లు సీక్వెల్?

ఈ సినిమా షూటింగ్ 2026 స్టార్టింగ్లో సెట్స్ మీదకు వెళ్తుందని, వచ్చే ఏడాది చివరిలో (డిసెంబర్ 2026) స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సీక్వెల్‌తో మళ్లీ కొత్త ఫ్రెష్ ఫేసెస్ ఎంట్రీ అవుతాయా? లేదా అదే క్యాస్ట్‌లో కొందరు ఉంటారా? అనేది తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకేవేళ ఇదే నిజమైతే మాత్రం.. ఒకటి మాత్రం కన్ఫర్మ్.. ఈ కాంబో మళ్లీ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం పక్కా అంటున్నారు మూవీ లవర్స్. కాగా విడాకులు తర్వాత ఈ మెగా డాటర్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. సిద్దు జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంది. రెండేళ్లు వైవాహిక జీవితంతో బిజీగా ఉంది.

 

అదే టైంలో భర్తతో మనస్పర్థలు కారణంగా నిహారిక సిద్దు జొన్నలగడ్డకు కొన్ని రోజులు పాటు దూరంగా ఉంది. ఆ తర్వాత సడెన్‌ విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. డైవోర్స్‌ తర్వాత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన ఆమె ఆ వెంటనే పింక్‌ ఎలిఫెంట పేరుతో సొంతంగా ప్రొడక్షన్‌ హౌజ్‌ స్థాపించింది. దీనిపై మొదటి కమిటీ కుర్రాళ్లు మూవీ నిర్మించింది. ఆ తర్వాత ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించింది. ఇప్పుడు తన బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.2కి సిద్దమైంది. మానస శర్మ దర్శకత్వంలో ఓ ఫాంటసి, కామెడీ డ్రామాను నిర్మించబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారికా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫుల్‌ హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పై రానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *