హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పలికింది. ఈ రోజు నిర్వహించిన వేలం పాటలో ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ రియాల్టీ(MSN Realty) సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ వేలంలో దక్కించుకుంది. ప్రారంభ ధరను టీజీఐఐసీ ఎకరాకు రూ.101 కోట్లుగా వేలం వేసింది. చివరకు ఒక ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున రాయదుర్గ్ నాలెడ్జ్ భూములను ఎంఎస్ఎన్ రియాల్టీ (MSN Realty) సంస్థ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారత దేశంలోని ఇది అత్యధిక ధరగా చెబుతున్నారు.
సౌత్ ఇండియాలో అత్యధిక ధర..?
గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరా ధర రూ.100.75 కోట్లు పలికింది. నియోపోలిస్ వేలం రికార్డును రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలం బ్రేక్ చేసింది. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ధరకు భూములు కొన్న సంస్థగా MSN రియాల్టీ (MSN Realty) పేరు నిలిచిపోయింది. నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాంతంలో ఉండడంతో ఈ భూములకు MSN రియాల్టీ (MSN Realty) సంస్థ ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వెనుకాడలేదు..