- సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా మంజుల ఈశ్వర్ గౌడ్- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని ఘనంగా శాలువాతో సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభు గౌడ్ గారు. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మంజుల ఈశ్వర్ గౌడ్ గారిని బీసీ మహిళల హక్కుల పక్షాన పోరాడాలని సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం ఎంతో ఆనందదాయకమని ఇట్టి అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా బీసీ మహిళలు అందరూ సంఘటితమై జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో బీసీ మహిళల యొక్క హక్కులను పొందేందుకు నిరంతరం పోరాడాలని, హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ నాలుగు శాఖల వారు బీసీ మహిళలకు గౌరవమిచ్చి బీసీ మహిళల హక్కుల సాధనకై ప్రాధాన్యత ఇవ్వాలని పేరుపేరునా కొనియాడారు మరియు బీసీ మహిళల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.