కూటమి హయంలో దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోంది..! : జగన్

చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. నేతలు దిగజారి మరీ స్కామ్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోలేదని, దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని దుయ్యబట్టారు.

 

ప్రభుత్వ స్కూళ్లు, ఆర్టీసీ, మెడికల్ వంటి విభాగాలను ప్రైవేటు పరం చేయడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తమ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యిందన్నారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్, ఎప్పటి మాదిరిగానే చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు.

 

ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రతీ జిల్లాలో 17 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. మెడికల్ కాలేజీలకు రూ. 500 కోట్లు ఖర్చు చేసి, అన్ని రకాల సదుపాయాలను కల్పించినట్టు చెప్పుకొచ్చారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలో తెచ్చారమని పదేపదే ఊదరగొట్టారు. దీనికి సంబంధించి అసలు విషయాలు బయటపెట్టింది టీడీపీ.

 

2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఓ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలనే పథకాన్ని తెచ్చింది. కేంద్రం ఇచ్చిన అవకాశాలను అన్ని రాష్ట్రాలు అంది పుచ్చుకున్నాయి. ఏపీ చేసిన ఖర్మ వల్ల 17 మెడికల్ కాలేజీలు రావాల్సివుండగా కేవలం 7 మెడికల్ కాలేజీలు చాలని ప్రతిపాదనలు వైసీపీ ప్రభుత్వం పంపిందని వెల్లడించింది. అందులో కేవలం మూడు కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

 

2018లో మొదలు పెట్టిన ఏలూరు, విజయనగరం కాలేజీలను మాత్రమే వైసీపీ హయాంలో పూర్తి అయ్యాయి. 2019-24 మధ్య తెలంగాణాలో-38, తమిళనాడు-29, కర్ణాటక-16 మెడికల్ కాలేజీలు రాగా, వైసీపీ హయాలంలో కేవలం ఐదు మాత్రమే వచ్చాయని తెలిపింది. అలాంటి వ్యక్తి ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుని, తానేదో 17 మెడికల్ కాలేజీలు కట్టేసినట్టు భ్రమ పడుతున్నారని టీడీపీ దుయ్యబట్టింది.

 

జగన్ తన ఊహాల ప్రపంచంలో 17 మెడికల్ కాలేజీలను వైసీపీ కట్టిందని చెప్పుకొచ్చారు. ప్రతీ జిల్లాల్లో కాలేజీలు ఉన్నాయని, స్టూడెంట్స్ చదువుతున్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రతి రోజూ పేదలకు వైద్యం అందుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే రూ.446.28 కోట్లు అవుతుందని, ఐదేళ్లలో జగన్ ఖర్చు పెట్టింది రూ.40 కోట్లు. ఇలా జగన్ ఏర్పాటు చేసిన ప్రతీ కాలేజీ గురించి వీడియో రూపంలో చూపించింది టీడీపీ. వైసీపీ హయాంలో నిర్మాణాలు చేపట్టిన ఆ కాలేజీలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టినట్టు వీడియో రూపంలో చూపింది. టీడీపీ చూపించిన నిజాలతో ఏది మాయాజాలం అంటూ సెటైర్లు పడిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *