సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో వినాయక ఉత్సవ నిమజ్జనాలను సంస్కృతి బద్దంగా నిర్వహిస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీకి మరియు వివిధ పార్టీల నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునపల్లి సత్యనారాయణ గారికి, బిజెపి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మాణిక్ రావు గారికి శాలువాతో ఘనంగా సన్మానించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గణనాథునికి వినాయక చవితిని పునస్కరించుకొని తొమ్మిది రోజులపాటు భజన భజంత్రీలతో, ధూప దాప నైవేద్యాలతో, అలంకరణతో, క్రమశిక్షణను అనుసరిస్తూ సదాశివపేట పట్టణాన్ని వినాయక నిమజ్జన ఉత్సవాలలో ఒక ప్రత్యేక స్థానం చరిత్రలో నిలిచే విధంగా ఆ ఘనత సదాశివపేట వాసులదేనని కొనియాడారు, ఆ యొక్క గణేశుని యొక్క ఆశీస్సులతో, అనుగ్రహంతో సదాశివపేట పట్టణ స్థాయి నుండి దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన వ్యక్తులలో సదాశివపేట పట్టణానికి చెందిన వాళ్లు కూడా చరిత్ర గుర్తించే స్థాయిలో ఉన్నారని వినాయక నిమజ్జన సందర్భంగా ఆ గణనాథుని యొక్క మహిమను పునరావృతం చేస్తూ గణేష్ ఉత్సవ కమిటీ సమక్షంలో, సదాశివపేట పట్టణ మరియు మండల ప్రజల సమక్షంలో, భక్తుల సమక్షంలో తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రవీంద్రనాథ్ సార్, అమృద్ది మల్లన్న పటేల్,మఠం వీరన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, పట్నం సుభాష్, బిజెపి పార్టీ నాయకులు సంగమేశ్వర్, కనిగిరి కృష్ణ గౌడ్, శ్రీశైలం యాదవ్, జనసేన పార్టీ నాయకులు సాకేత్, బి ఆర్ ఎస్ (టిఆర్ఎస్ )పార్టీ నాయకులు కోడూరు అంజయ్య, కరాటే మాస్టర్ కనిగిరి శంకర్ గౌడ్, మునిపల్లి సతీష్ గౌడ్, సదాశివపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఉల్లిగడ్డల శివకుమార్, భారత్ టుడే రిపోర్టర్ ఎర్ర. వీరేందర్ గౌడ్, మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు వివిధ వినాయక మండపాల కమిటీ నాయకులు పాల్గొన్నారు