- సంస్కృతి పరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం – కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో, హనుమాన్ నగర్ దేవాలయ విఘ్నేశ్వర మండపంలో ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్న శివకోటి పంతులు గారికి శాలువాతో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజుల నుండి ఘనంగా భక్తి భజనలతో, ధూప దాప నైవేద్యాలతో, అలంకరణతో, క్రమశిక్షణతో సంస్కృతి బద్ధమైన కార్యక్రమాలు నిర్వహించిన హనుమాన్ నగర్ హనుమాన్ మందిరం ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు అందరిపై ఉంటూ దిన దిన అభివృద్ధి పథంలో ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ఆ గణనాథుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొన్నారు.