రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కు చేరిందని తెలిపారు. అందులో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి కాగా, 11 మంది మృతి చెందారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఇంకా 397 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విదేశాల నుంచి వచ్చి క్వారం టైన్లో ఉన్నవాళ్లందరికీ గురువారం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ‘కరోనా విజృంభించిన తర్వాత సుమారు 25 వేల మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. వీళ్లంతా వాళ్ల ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. ఈ నెల 7 నాటికే వీళ్లందరి క్వారంటైన్ పీరియడ్ (14 రోజులు) పూర్తయింది. మరో రెండ్రోజులు అదనంగానే వీళ్లను క్వారంటైన్లో ఉంచిన ప్రభుత్వం, గురువారం అందరికీ విముక్తి కల్పించనుంది. విదేశాల నుంచి వచ్చినవాళ్లు, వాళ్ల కాంటాక్ట్ పర్సన్స్‌ను కూడా