సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పట్టణంలోని ఐబి ప్రాంగణంలో మెగా పిరమిడ్ ఆవశ్యకత గురించి, ధ్యానం యొక్క విలువల గురించి చలో తిరుపతి ధ్యాన మహా యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సదాశివపేట పట్టణం, సిద్ధాపూర్ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసే మెగా పిరమిడ్ క్షేత్రం అక్షరధామ్ లోని స్వామి నారాయణ దేవస్థాన ఆకృతిలో నిర్మాణం 108 కోట్లతో జరుపబడుతుందని, ఇందుకు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్షమంది జన సమీకరణతో త్వరలో పనులు ప్రారంభం జరుగుతాయని పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో, వివిధ జిల్లాల నాయకుల సమక్షంలో, ప్రజల సమక్షంలో, విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు అదేవిధంగా ఇట్టి క్షేత్రం యొక్క విలువను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 16 రోజు నుండి 22 వరకు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ధ్యాన మహా యజ్ఞాలు నిర్వహించబడతాయి ఇట్టి కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం పి ఎస్ ఎస్ యమ్ ఛానల్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు పిలుపునిస్తూ ధ్యాన మహా యజ్ఞమే, ప్రపంచ శాంతికి మార్గమని తెలియజేశారు, ఇట్టి మార్గాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ అనుసరిస్తే అంతా ధ్యానమయం శాంతి మయం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా తిరుపతిలో జరగబోయే కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ పేరుపేరునా పాల్గొనాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్, వికారాబాద్ కాంటెస్ట్ ఎమ్మెల్యే రామ్ రాజ్, నర్సాపూర్ లక్ష్మి పిరమిడ్ వ్యవస్థాపకులు బి సత్యనారాయణ మాస్టర్, పి ఎస్ ఎస్ ఎమ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాస్టర్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాస్టర్ గారు, వివిధ జిల్లాల నాయకులు, ప్రజలు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.