ఎమ్మెల్యే కూన రవి నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు.. చచ్చిపోతా అంటూ కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీళ్లు..!

ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై లోలుగు కేజీవీబీ ప్రిన్సిపల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రిన్సిపల సౌమ్య ఆరోపించారు. అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ.. రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇందుకు సంబంధించిన నైట్ టైమ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఎమ్మెల్యేపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు..

 

ఎమ్మెల్యే అనుచరులు సైతం నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆమె బోరు ఏడ్చసాగారు. ప్రిన్సిపల్ సౌమ్య కన్నీరుమున్నీరు అవుతున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక.. తమ్ముడు కాల్ చేసి జరిగిన సమాచారం అంతా చెప్పుకుంటూ విలపించారు. ఎమ్మెల్యే మాట వినలేదనే తనను.. వేరే ప్రాంతానికి ట్రాన్స ఫర్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

 

ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. చచ్చిపోతా

 

‘ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. భరించలేకపోతున్నాను.. నా వల్ల కావడం లేదు. ఎందుకు..? ఆయన నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నాడు..? వేధిస్తున్నాడు.. పై అధికారులు కూడా ఆయన చెప్పిందే వింటున్నారు. నాకు న్యాయం జరగడం లేదు. సమాజంలో ఇంత గౌరవంగా బతుకుతున్నా.. నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారు..? వేధింపులకు నేను శారీరకంగా లొంగడం లేదని.. మరింత టార్చర్ చేస్తున్నారు.. ఇక నాకు చచ్చిపోవాలని ఉంది.. నేను ఆత్మహత్య చేసుకుంటా..’ అని ప్రిన్సిపల్ సౌమ్య బోరున విలపించారు.

 

వైసీపీ సంచలన ట్వీట్..

 

కూన రవి కుమార్ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైసీపీ సంచలన పోస్టులు పెడుతోంది. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బెదిరిస్తూ.. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *