చిరంజీవి ఇంట్లో నిర్మాతల కీలక సమావేశం..

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో నిర్మాతల భేటీ ముగిసింది. సినీ కార్మికుల సమ్మెపై (Cine Workers Strike) మంగళవారం నిర్మాతలు ఆయన ఇంట్లో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం నిర్మాత సి. కళ్యాణ్‌ మీడియాలో మాట్లాడారు. నిర్మాతలు చిరంజీవి (Producers Meeti ng With Chiranjeevi) గారిని కలిసి సమస్య చెప్పామన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించాము. దీనిపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదని, మీ సమస్యలు చెప్పారు అటు వైపు కార్మికుల వెర్షన్‌ను కూడా తెలుసుకుంటానన్నారు.

 

చిరంజీవి ఇంట్లో భేటీ

 

రెండు మూడు రోజుల్లో పరిస్థితులు చక్కబడకపోతే తాను జోక్యం చేసుకుంటానన్నారు. రేపు ఈ సమస్యలపై చర్చిస్తామని నిర్మాత సి కళ్యాణ్‌ తెలిపారు. కాగా వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఏడాదికి 10 శాతం చొప్పున మూడేళ్లకు 30 శాతం వేతనాలని పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల నుంచి సానుకూలన స్పందన రాకపోవడంతో తెలుగు ఫిలిం ఫేడరేషన్‌ కార్మికులతో కలిసి సమ్మెకు పిలుపునిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండానే రాత్రిరాత్రే కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో టాలీవుడ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె కారణంగా మీడియం, చిన్న సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి.

 

భేటీలో పాల్గొంది వీళ్లే

 

ఈ సమావేశంలో ఫిలిం చాంబర్‌ సభ్యులు సి కళ్యాణ్‌.. నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, సుప్రియ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమ్మె వల్ల ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాతల వేతనాల పెంపుకు నిరాకరించడంతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సమ్మెకి దిగింది. ఫిలిం ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. అయితే పెద్ద సినిమాల షూటింగ్స్‌ మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. కొందరు కార్మికులు మాత్రం సమ్మెతో సంబంధం లేకుండ షూటింగ్స్‌లో పాల్గొనడంతో సమ్మె కార్మికులు వారిని హెచ్చరిస్తున్నారు.

 

షూటింగ్స్‌లో పాల్గొనవద్దని వారిని బెదిరిస్తూ.. షూటింగ్స్‌ని అడ్డుకుంటు అంతరాయం కలిగిస్తున్నారు. అలాంటి వారిపై ప్రొడ్యూసర్స్‌ గిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె పేరుతో ఆందోళన చేపడుతూ.. షూటింగ్స్‌కి అంతరాయి కలిగిస్తున్న వారిపై బ్యాన్‌ విధించేలా నిర్ణయం తీసుకోబోతున్నారట. భవిష్యత్తులో వారు షూటింగ్స్‌లో పాల్గొనకుండ నిర్మాతలు కార్మికులకు షాకివ్వబోతున్నారట. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, ఆ దిశ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. అయితే ఈ సమ్మె వెనక ఫెడరేషన్‌ కుట్ర ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులను అడ్డుపెట్టుకుని నాయకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నారంటూ ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *