ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22 న పహల్గామ్‌లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ జరిగింది. జైష్-ఎ-మహ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. పాక్ సైనిక స్థావరాలను, ఆ దేశ పౌరుల అటాక్ చేయకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ 22 నిమిషాల్లో ముగిసింది. ఆపరేషన్ సిందూర్ లో మొత్తం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని నివేదకలు చెబుతున్నాయి.
తాజాగా ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆపరేషణ్ సిందూర్ పేరిట మొత్తం వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సపోర్ట్ ఉందని చెప్పారు. పీవోకేలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని అన్నారు. ఉగ్రవాదులను టార్గెట్ చేశామని.. పాక్ ప్రజలను కాదని ఆయన అన్నారు. పహల్గామ్ లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారని.. అందుకు గానూ ఆపరేషన్ సిందూర పేరుతో ఉ్రగ్రవాద స్థావరాలను లేపేశామని తెలిపారు.
‘ఆపరేషన్ సిందూర్ ఆపాలని తమకు ఎవరి నుంచి ఒత్తిళ్లు రాలేదని అన్నారు. పాకిస్థాన్ ఓటమిని అంగీకరించందని చెప్పారు. అందుకే యుద్ధాన్ని ఆపామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు.. విరామం ఇచ్చాం అంతే.. ఉగ్రవాదులనే టార్గెట్ చేశాం తప్ప.. పాక్ ప్రజలను కాదు. పాక్ పై అటాక్ తర్వాత డీజీఎంఓ సమాచారం ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపాం. దేశ ప్రజలను రక్షించడం మా బాధ్యత. పాక్ పౌరులకు నష్టం వాటిల్లకుండా దాడులు చేశాం. 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం’ అని చెప్పారు.
‘ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు. సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇలాంటి మాటలు వినలేదు. సైన్యం విషయంలో ఆచితూచి మాట్లాడాలి. 1962 చైనాతో యుద్ధం సమయంలో.. విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలి. సైన్యాన్ని ఆనాడు వాజ్‌పేయి ప్రశంసించారు’ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.