ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జోరందుకుందా..? విజయసాయిరెడ్డికి మళ్లీ పిలుపు..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జోరందుకుందా? ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిందా? మళ్లీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు వెనుక అసలే మేటరేంటి? ఈసారి అధికారుల వంతు కానుందా? కొద్దిరోజుల్లో కీలక అరెస్టుల పర్వానికి తెరలేవనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. జులై 12 అంటే శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలో సిట్‌ కార్యాలయానికి రావాలని పేర్కొంది. తాజాగా మరోసారి ఆయన్ని సెట్ విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది.

 

ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏప్రిల్‌ 18న సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు బయటపెట్టారు. ఆసమయంలో కసిరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటివరకు కసిరెడ్డి గురించి తెలీదు. వీఎస్ఆర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తీగలాగితే ఈ కేసులో డొంక కదిలింది.

 

ఈసారి ఇంకెవరు పేర్లు ఆయన చెబుతారోనని వైసీపీ కీలక నేతల్లో టెక్షన్ మొదలైంది. దీనికి సంబంధించి విచారణకు రావాలని ఓ ఐఏఎస్ అధికారికి సిట్ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈసారి పెద్ద తలకాయలు బయటపడడం ఖాయమని అంటున్నారు.

 

2019లో వైసీపీ అధికారం అధికారంలోకి రాగానే డిస్టిలరీలు-మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకునేందుకు నూతన మద్యం విధానం కోసం జరిగిన సమావేశాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఆయన నివాసంలో భేటీలు జరిగాయని సిట్‌ ఇప్పటికే బయటపెట్టింది.

 

అదాన్‌ డిస్టిలరీస్‌కు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రుణాలు ఇవ్వడం వెనక వీఎస్ఆర్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో కుంభకోణంలో ప్రధాన వ్యక్తి ఎవరు? ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరాయి? వంటి అంశాలపై సిట్‌ ఆయన్ని ప్రశ్నించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

వైసీపీతో విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధాలు అంతాఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాలు ఆయనకు తెలుసని సిట్ బలంగా నమ్ముతోంది. మద్యం కేసుకు సంబంధించి వ్యవహారంలో ఆ మధ్య మీడియాతో మాట్లాడారు వీఎస్ఆర్. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానంటూ ఓపెన్‌గా చెప్పారు.

 

ఈసారి విచారణలో ఆయన రాజకీయల పేర్లు బయటపడతాయా? లేకుంటే అధికారుల పేర్లు బయటపడతారో చూడాలి. ఈ కేసులో వైసీపీ పెద్ద తలకాయలు ఉండడంతో జాగ్రత్తగా దర్యాప్తు చేస్తోంది. ప్రశ్నించే ఛాన్స్ ఇవ్వకుండా అన్ని ఆధారాలను సేకరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *