ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కు ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్(Bank Scam) కేసులో భాగంగా ఈడి అధికారులు దాదాపు మూడు గంటల పాటు అల్లు అరవింద్ ను విచారణ చేస్తూ ప్రశ్నలు వేశారు. 2018- 19 మధ్య జరిగిన ఈ స్కామ్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో పాటు, ఆస్తుల కొనుగోలుపై ఎన్నో ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. ఇలా మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు తదుపరి వచ్చేవారం మరోసారి విచారణకు హాజరు కావాలి అంటూ ఈయనకు నోటీసులను జారీ చేశారు. ఇలా గతంలో జరిగిన స్కాం కి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇది అల్లు అరవింద్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి.