విశాఖపట్నం తీరాన.. అంతర్జాతీయ యోగా దినోత్సవం..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్కొన్నారు.

 

ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు పచ్చిటి తివాచీపై 5లక్షల మంది పాల్గొన్నారు. 34 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన 326 కంపార్ట్‌మెంట్లలో యోగా చేశారు.

 

ఏయూ మైదానంతో పాటు.. గోల్ఫ్ క్లబ్, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం, పోర్ట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా మొత్తం 18 క్రీడా మైదానాల్లో 5 లక్షల మంది యోగాసనాలు వేశారు. ప్రజలను కంపార్ట్‌మెంట్లకు తరలించేందుకు యాప్‌లను వాడారు అధికారులు.

 

ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు అధికారులు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ముందుగానే రిజిస్ట్రేషన్ క్యూఆర్‌ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించారు. ఉచితంగా యోగా మ్యాట్‌లు, టీ షర్ట్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 62 కోట్ల బడ్జెట్‌తో నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం 3వేల తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రతి ఐదు కంపార్ట్‌మెంట్‌లకు ఒక వైద్య శిబిరం, ప్రధాన వేదికల వద్ద పది పడకల తాత్కాలిక ఆస్పత్రి నిర్మించారు.

 

కార్యక్రమానికి వచ్చిన ప్రజల తరలింపునకు 3,600 ఆర్టీసీ బస్సులు, 7,295 ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. మోడీ రాకతో.. మొత్తం 10వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 2వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

 

యోగాంధ్ర కార్యక్రమానికి తరలివెళ్తున్న ప్రజలు బీచ్‌వైపు వెళ్తున్న వాహనాలు ప్రధాన కూడల్లలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు బీచ్ వైపు రోడ్డులో స్తంభించిన వాహనాలు విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అన్ని కూడల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. బీచ్‌రోడ్డు వైపు భారీగా వెళ్తుండటంతో వాహనాలు స్థంభించిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *