షర్మిల ఫోన్ ట్యాపింగ్..! క్లారిటీ ఇచ్చిన జగన్..

షర్మిల ఫోన్ ట్యాపింగ్. రెండు రోజులుగా రచ్చ నడుస్తోంది. సిట్ విచారణలో ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. జగన్‌ కోసమే కేసీఆర్.. షర్మిల ఫోన్ ట్యాప్ చేయించారని అంటున్నారు. అవును, నిజమే అంటూ షర్మిల సైతం ఇప్పటికే మీడియోకు క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్లు సైతం చాటుగా విన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం వైసీ సుబ్బారెడ్డినే తనకు స్వయంగా చెప్పారని.. కాల్ రికార్డ్ చేసిన ఓ ఆడియో క్లిప్ కూడా వినిపించారని మరింత సంచలన కామెంట్స్ చేశారు. షర్మిల చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఉలిక్కిపడింది. అలాంటిదేమీ లేదు.. తాను షర్మిలతో అలా ఎప్పుడూ అనలేదని వైవీ సుబ్బారెడ్డి కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇదే విషయంపై జగన్‌ను ప్రశ్నిస్తే.. ఆసక్తికర సమాధానం చెప్పారాయన.

 

జగన్ రియాక్షన్

 

తన ఫోన్ ట్యాప్‌ చేశారన్న షర్మిల ఆరోపణలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్‌గా ఉంది కాబట్టి చేశారేమోనని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేశారో లేదో తమకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకేంటి సంబంధమని జగన్ ప్రశ్నించారు.

 

ఆ మాటలకు అర్థాలే వేరులే..

 

జగన్ కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఆయన డైరెక్ట్‌గా చెప్పలేకపోయారు. చేస్తే చేసుంటారులే అన్నట్టు మాట్లాడారు. అంటే..? చేసినట్టేగా? పక్క రాష్ట్రంలో జరిగిన విషయం అంటూ.. తనకు సంబంధం లేదంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అవును, ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలంగాణలోనే. జగన్‌కు సంబంధం లేని మేటరే. కానీ, షర్మిల ఫోన్ జగన్ కోరిక మీదనే ట్యాప్ చేశారని కదా అంటున్నది. చేశారేమో అని జగనే అన్నారంటే.. చేయించి ఉంటారుగా? అని అనుమానిస్తున్నారు.

 

షర్మిల స్పెషల్ కేసు

 

షర్మిల ఫోన్ ట్యాపింగ్‌ను స్పెషల్ కేటగిరీగా డీల్ చేశారట ప్రభాకర్‌రావు అండ్ టీమ్. ఆమె అప్‌డేట్స్ షేర్ చేయడం కోసం ప్రత్యేకంగా కోడ్ లాంగ్వేజ్ కూడా వాడారట. అంటే.. ఎంత ప్రయారిటీ ఇచ్చి ఉంటారో తెలుస్తోంది. వైఎస్సార్‌టీపీ ని చూసి, షర్మిలను చూసి కేసీఆర్ భయపడేంతగా మరీ అంత ప్రభావవంతంగా రాజకీయం ఏమీ చేయలేదామె. అయినా, ఫోన్ ట్యాపింగ్ చేశారంటే అది పక్కా జగన్ కోసమే అయి ఉంటుందనే అనుమానం బలంగా ఉంది. షర్మిల సైతం అదే చెబుతోంది. సిట్ పిలిస్తే వెళ్లి తన అభిప్రాయం చెబుతానని అంటున్నారు షర్మిల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *