పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా అవతరించిన తర్వాత, ఇక ఆయన సినిమాలు చేయరని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల కోసం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇక అందుకే ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు చకచకా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. వెంటనే ‘ఓ.జీ’ మూవీని కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు హరీష్ శంకర్ (Harish Shankar) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్ లోకి కూడా అడుగుపెట్టారు. మూవీ మేకర్స్ తాజాగా ఈయన సెట్ లోకి వచ్చిన విషయాన్ని కూడా వీడియో రూపంలో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక దీంతో ఈ మూడు సినిమాలు త్వరలోనే పూర్తి చేయబోతున్నారని అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మూడు సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి హరిహర వీరమల్లు 2 సినిమా ఉందని చెప్పారు కానీ ఇక దాని మాట ఇప్పటివరకు ఎత్తలేదు.
సురేందర్ రెడ్డి మూవీ మొదలయ్యేనా..?
దీనికి తోడు గతంలో సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఒకవేళ అదే జరిగితే సినీ ప్రియుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఇప్పుడు మరొక వార్త తెరపైకి వచ్చింది. కాస్త ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 2023లో ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాజెక్టులను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. కానీ సినిమా మాత్రం మొదలు కాలేదు.
అయితే ఒకసారి నిర్మాత స్పందించి సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది. కానీ సినిమా తీయడానికి పవన్ అందుబాటులో లేకపోవడం వల్లే బాధాకరం. ఇచ్చిన అడ్వాన్స్ ని కూడా వెనక్కి తీసుకోలేదు అని తెలిపారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లి బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మూడు చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. దీంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. అలా ఈ సినిమా రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
త్వరలో అభిమానులకు గుడ్ న్యూస్..
అసలు విషయంలోకెళితే.. సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అటు నిర్మాత రామ్ తాళ్లూరి, పవన్ సన్నిహితులు కాబట్టి ఆ మూవీని మళ్లీ మొదలు పెడతారని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఉస్తాద్ పూర్తి చేసి , తన ప్రాజెక్టు కోసం తేదీ కేటాయించాలని సురేందర్ రెడ్డి కోరుకుంటున్నారట.
సాధారణంగా అటు డైరెక్టర్లను, ఇటు నిర్మాతలను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నిరాశపరచరు. కచ్చితంగా సురేందర్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటు సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక సురేందర్ రెడ్డి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.