ఇటీవల జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కదలికలు కలకలం సష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ భవనంపై శుక్రవారం తెల్లవారుజామను డ్రోన్ సంచరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ సంచారం భద్రత ఉల్లంఘన చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ నిఘా డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) గుర్తించి, కాల్పులు ప్రారంభించింది. దీంతో ఈ డ్రోన్ వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. అర్నియా సెక్టార్‌లో శువ్రారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఈ సంఘటన జరిగింది. బిఎస్‌ఎఫ్ పోస్ట్‌కు అతి సమీపంగా ఈ డ్రోన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, జమ్ములో ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడుల తరువాత ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. అలాగే జమ్ములోని వివిధ ప్రాంతాల్లో సోమ, మంగళ, బుధవారం రాత్రి సమయాల్లో కీలకమైన ఆర్మీ స్థావరాలపై డ్రోన్లు కనిపించాయి.