తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ షూటింగ్ ను ఇటీవల తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ సంగీత దర్శకుడు. ఇప్పుడు ఆ మూవీ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, నట నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ మూవీ తీస్తున్నాడు. అయితే పదిహేనేళ్ళుగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న విజయ్ ఆనంద్… ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే టైటిల్ తో విశాల్ ‘చక్ర’ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ కథ చెప్పాడట. ఇప్పుడు తన సినిమా టైటిల్ ను ఇల్లీగల్ గా విశాల్ తన మూవీకి పెట్టేసుకున్నాడని ఆరోపిస్తున్నాడు. విశాల్ ను ఈ విషయమై ప్రశ్నిస్తే అతని మనుషులు తనను బెదిరిస్తున్నారంటూ ఉదయినిధి స్టాలిన్ కు విజయ్ ఆనంద్ ఫిర్యాదు చేశాడట.