పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పరిశీలించిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, జిన్నారం ఎంపీడీవో ఆఫీస్ లో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను సందర్శించి పరిశీలించిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ వెంకన్న , లక్ష్మణ్ యాదవ్ మరియు ప్రముఖ నాయకులు. ఈ సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో జహీరాబాద్ పర్యటనలో భాగంగా శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు జహీరాబాద్ సమీపంలో గల ప్రాంతంలో భూములను కోల్పోయిన నిరుపేదలకు సుమారు 5200 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఇందిరమ్మ ఇండ్లను భూములు కోల్పోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని తెలియపరచడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అదేవిధంగా భూములు కోల్పోయిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారాన్ని తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించుటకు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండల ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి సూపర్డెంట్ మదనాల రఘు గారితో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మాణ ప్రక్రియ గురించి చర్చించి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రత్యేక శ్రద్ధతో పేదోడి కలను నెరవేర్చడం కోసం నాణ్యత మైన కట్టడాన్ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ను సందర్శించిన వారందరూ సంతోషదాయకంగా వారి యొక్క భావాన్ని వ్యక్తపరిచారని తెలియజేశారు ఈ తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి, TGIIC చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు ప్రారంభించే విధంగా చూస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *